
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల పంపకంపై ఉత్కంఠకు తెరపడింది. అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పదవుల పంపకం కొలిక్కి వచ్చింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఏ పార్టీకి ఎన్ని జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు కేటాయించాలనే దానిపై కూటమి నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం జిల్లా పరిషత్ పదవుల పంపకానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది.
ఈ పదవుల పంపకంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ పలుమార్లు చర్చలు జరిపారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం కుదిరిన అనంతరం పదవుల కేటాయింపును ఖరారు చేశారు.
టీడీపీకి 22 జెడ్పీ ఛైర్మన్ పదవులు
మొత్తం 27 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 22 స్థానాలు కేటాయించారు. జనసేనకు నాలుగు, బీజేపీకి ఒక ఛైర్మన్ పదవిని కేటాయించారు. అలాగే జెడ్పీ వైస్ ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 20, జనసేనకు ఐదు, బీజేపీకి రెండు స్థానాలు దక్కాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో జనసేనకు జెడ్పీ ఛైర్మన్ పదవులు కేటాయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి ప్రాంతంలో కీలకమైన కాకినాడ జిల్లా ఛైర్మన్ పదవిని కూడా జనసేనకు కేటాయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక కృష్ణా జిల్లాను భారతీయ జనతా పార్టీకి కేటాయించారు.
జిల్లాల వారీగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థులు
టీడీపీ అధిష్ఠానం విడుదల చేసిన జాబితా ప్రకారం జిల్లాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.
1. శ్రీకాకుళం: ఛైర్మన్ – జనసేన, వైస్ ఛైర్మన్ – గుంటు విజయ్ కుమార్.
2. విజయనగరం: ఛైర్మన్ – మజ్జి సిరి సహస్ర, వైస్ ఛైర్మన్ – పసల నీరజ.
3. పార్వతీపురం మన్యం: ఛైర్మన్ – జనసేన, వైస్ ఛైర్మన్ – వైరిచెర్ల వీరేశ్ చంద్ర దేవ్.
4. విశాఖపట్నం: ఛైర్మన్ – గాడు అలివేణి, వైస్ ఛైర్మన్ – సుఖవాసి అజయ్ ఏ.ఎన్.
5. అనకాపల్లి: ఛైర్మన్ – జనసేన, వైస్ ఛైర్మన్ – పెంటకోట స్వాతి.
6. పోలవరం: ఛైర్మన్ – వంత్లం రాజేశ్వరి, వైస్ ఛైర్మన్ – తీగల ప్రభ.
7. కాకినాడ: ఛైర్మన్ – జనసేన, వైస్ ఛైర్మన్ – పిల్లి అనంతలక్ష్మి.
8. తూర్పు గోదావరి: ఛైర్మన్ – కడ పద్మ, వైస్ ఛైర్మన్ – జనసేన.
9. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ: ఛైర్మన్ – గొల్లపల్లి అమూల్య, వైస్ ఛైర్మన్ – జనసేన.
10. పశ్చిమ గోదావరి: ఛైర్మన్ – ఇందుకూరి రామకృష్ణ రాజు, వైస్ ఛైర్మన్ – సిరుగాని నాగేశ్వరరావు.
11. ఏలూరు: ఛైర్మన్ – చింతమనేని సాయి నవ్య శ్రీ, వైస్ ఛైర్మన్ – బొర్రా చలమయ్య.
12. కృష్ణా: ఛైర్మన్ – బీజేపీ, వైస్ ఛైర్మన్ – దండమూరి పూజిత.
13. ఎన్టీఆర్: ఛైర్మన్ – కోట పుల్లమ్మ, వైస్ ఛైర్మన్ – బీజేపీ.
14. గుంటూరు: ఛైర్మన్ – ధారా అరుణ, వైస్ ఛైర్మన్ – తాళ్ల అశోక్ కుమార్.
15. పల్నాడు: ఛైర్మన్ – పుచ్చకాయల రూమాదేవి, వైస్ ఛైర్మన్ – నల్లపాటి కిరణ్.
16. బాపట్ల: ఛైర్మన్ – పుష్పాంజలి రోహిణి, వైస్ ఛైర్మన్ – జనసేన.
17. ప్రకాశం: ఛైర్మన్ – కొక్కిలిగడ్డ ప్రభాకర్ రావు, వైస్ ఛైర్మన్ – జనసేన.
18. మార్కాపురం: ఛైర్మన్ – కందుల రామిరెడ్డి, వైస్ ఛైర్మన్ – జె.వి. శ్రీనివాస వర్మ.
19. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: ఛైర్మన్ – పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైస్ ఛైర్మన్ – పొట్టెల ప్రసాద్.
20. కర్నూలు: ఛైర్మన్ – చౌడు ఉలిగయ్య, వైస్ ఛైర్మన్ – షేక్ షాహిద్.
21. నంద్యాల: ఛైర్మన్ – షేక్ బృహనుద్దీన్, వైస్ ఛైర్మన్ – కె. శ్రీకాంత్ రెడ్డి.
22. అనంతపురం: ఛైర్మన్ – గంజే నాగరాజు, వైస్ ఛైర్మన్ – వెన్నపూస లలిత.
23. శ్రీ సత్యసాయి: ఛైర్మన్ – పరిటాల శ్రీరామ్, వైస్ ఛైర్మన్ – జనసేన.
24. వైఎస్ఆర్ కడప: ఛైర్మన్ – పుట్టా నరసింహారెడ్డి, వైస్ ఛైర్మన్ – హబీబున్నిసా చాంద్ బాయ్.
25. అన్నమయ్య: ఛైర్మన్ – సుగవాసి ప్రసాద్ బాబు, వైస్ ఛైర్మన్ – తాళ్లారి శరణ్య.
26. తిరుపతి: ఛైర్మన్ – హేమలత, వైస్ ఛైర్మన్ – బీజేపీ.
27. చిత్తూరు: ఛైర్మన్ – మాదాల శైలజ, వైస్ ఛైర్మన్ – ఎస్. మంజులయ్య వెంకటేష్.
కూటమిలో సమన్వయానికి ప్రాధాన్యం
జిల్లా పరిషత్ పదవుల పంపకంలో మూడు పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ కూటమి నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా జనసేన, బీజేపీలకు కూడా కీలకమైన జిల్లాల్లో పదవులు కేటాయించడం ద్వారా మిత్రపక్షాల మధ్య రాజకీయ సమన్వయాన్ని కొనసాగించే ప్రయత్నం చేసింది. అయితే, పదవుల కేటాయింపు ప్రకటన వెలువడినప్పటికీ ఆయా జిల్లాల్లో అధికారిక ఎన్నికల ప్రక్రియ, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికల అనంతరమే పదవులు ఖరారు కానున్నాయి. కూటమి అధిష్ఠానం నిర్ణయంతో జిల్లా స్థాయిలో రాజకీయంగా కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..