Andhra Pradesh weather report : రేపు, ఎల్లుండి అక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు, ఇక్కడ తీవ్ర వడగాలులు

|

Apr 02, 2021 | 6:28 PM

Andhra Pradesh weather report : ఇవాళ, రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌ లో వాతావరణ మార్పులకు సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు..

Andhra Pradesh weather report : రేపు, ఎల్లుండి అక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు, ఇక్కడ తీవ్ర వడగాలులు
Weather Report
Follow us on

Andhra Pradesh weather report : ఇవాళ, రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌ లో వాతావరణ మార్పులకు సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు నివేదిక ఇచ్చారు. ఆ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ విధంగా ఉన్నాయి :

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం :

ఈ రోజు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులు మరియు 40-50 km వేగం గల ఈదురు గాలులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్ర :

ఈ రోజు, రేపు, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వడగాల్పులు, అక్కడక్కడ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నది. ఇక, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:

ఈ రోజు, రేపు రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో వడగాల్పులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.

Read also : KTR KMM tour : కేటీఆర్ ఖమ్మం టూర్‌, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఖమ్మం బస్టాండ్‌ కు ప్రారంభోత్సవం