Weather Alert:ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు! నేడు ఏ జిల్లాల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది?

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు సోమవారం నాటికి ఆంధ్రప్రదేశ్‌ అంతటా విస్తరించాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొన్నారు. కాబట్టి ఏ జిల్లాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం పదండి.

Weather Alert:ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు! నేడు ఏ జిల్లాల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది?
Ap Weather Forecast

Updated on: Jun 16, 2026 | 9:00 AM

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు సోమవారం నాటికి ఆంధ్రప్రదేశ్‌ అంతటా విస్తరించాయని, వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడి వర్షాలు కురవనుండగా.. మరికొన్ని చోట్ల ఎండల ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మంగళవారం (16-06-26) విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తాంధ్ర మిగతా జిల్లాలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మరోవైపు ఎండ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు.

అలాగే ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

తెలంగాణలో వాతావరణం ఇలా 

ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు ప్రభావంతో ఇటు తెలంగాణలోనూ మంగళ, బుధవారం, గురువారాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే ఎల్‌నీనో నేపథ్యంలో మరి కొన్ని జిల్లాల్లో భారీ ఉష్ణొగ్రతలు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉందని.. వర్షాలు ఎండల పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us