AP SEC vs AP Government: ఎన్నికల కమిషన్ సెక్రటరీ పోస్ట్ నుంచి వాణీమోహన్‌ను తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. వాణీ మోహన్‌ను తొలగించినట్టు చీఫ్ సెక్రటరీకి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను నిమ్మగడ్డ రిలీవ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే జాయింట్ డైరెక్టర్ సాయి ప్రసాద్‌ను కూడా విధుల నుంచి తొలగించారు నిమ్మగడ్డ.
మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల షెడ్యుల్, హైకోర్టు తీర్పు, ప్రభుత్వ వైఖరి తదితర పరిణామాలపై ఇరువురి మధ్య జర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ఈసీలోని ఉద్యోగులను ప్రభుత్వం ప్రభావితం చేస్తోంది అని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏపీలో పంచాయతీ ఎన్నికల ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ వెలువరించిన నిర్ణయంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. డివిజన్ బెంచ్‌లో అప్పీలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
Also Read: Family Suicide: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం.. ఏడాదిన్నర బాలుడు సహా దంపతులు బలవన్మరణం