నెల్లూరు జిల్లాలో ఎస్‌ఈసీ పర్యటన.. పలు కీలక అంశాలపై అధికారులకు నిమ్మగడ్డ ఆదేశం

ఆంధ్రపద్రేశ్‌ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వరుస జిల్లాల పర్యటనలతో బిజీగున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో

నెల్లూరు జిల్లాలో ఎస్‌ఈసీ పర్యటన.. పలు కీలక అంశాలపై అధికారులకు నిమ్మగడ్డ ఆదేశం

Updated on: Feb 04, 2021 | 6:03 PM

ఆంధ్రపద్రేశ్‌ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వరుస జిల్లాల పర్యటనలతో బిజీగున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించిన నిమ్మగడ్డ.. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఆయన…జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.

అంతకంటే ముందు తిరుమల శ్రీవారిని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయ‌న‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ త‌ర్వాత శ్రీవారి తీర్థ ప్రసాదాలను ఆయ‌న‌కు అందజేశారు. ఏపీలో స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు నిమ్మగడ్డ చెప్పారు.

బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు కూడా తిరుమ‌ల‌ శ్రీవారిని దర్శించుకున్నారు. భార‌త్ ఆర్థిక ప్రగతి సాధించాలని శ్రీవారిని ప్రార్థించిన‌ట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో, ప్రజల విరాళాలతో నిర్మిస్తున్న అయోధ్య రామాల‌యం హిందువులకు ఆరాధ్య దేవాలయంగా విలసిల్లుతుంద‌ని చెప్పారు.

 

Read more:

పోలవరం గురంచి మట్లాడే అర్హత ఆ పార్టీలకు లేదు.. వారికి రూలింగ్‌ కన్నా ట్రేడింగే ముఖ్యమన్న సోము వీర్రాజు

పంచాయతీ ఎన్నికలపై ఆ పిటిషన్‌ను కొట్టి వేసిన ఏపీ హైకోర్టు.. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించని ధర్మాసనం