AP Covid Cases: గుడ్ న్యూస్.. ఏపీలో కరోనా కేసులు నిల్.. అయినా మాస్క్‌లు పెట్టుకోవాలని వైద్యుల సూచన

AP Covid News: ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి మొదలైన తర్వాత తొలిసారిగా ఏపీలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు.

AP Covid Cases: గుడ్ న్యూస్.. ఏపీలో కరోనా కేసులు నిల్.. అయినా మాస్క్‌లు పెట్టుకోవాలని వైద్యుల సూచన
Covid 19

Updated on: Apr 26, 2022 | 10:36 AM

AP Covid Cases: ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి మొదలైన తర్వాత తొలిసారిగా ఏపీలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. ఆ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి అధికారిక బులిటెన్ విడుదల చేసింది. ఇందులో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఆదివారం 2,163 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఒక్క కోవిడ్ పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. అలాగే కోవిడ్ కారణంగా ఎవరూ మరణించలేదు.

అలాగే గతంలో కోవిడ్ బారినపడిన వారిలో 12 మంది కోలుకున్నట్లు ఆ బులెటిన్‌లో తెలిపారు. సోమవారం వరకు రాష్ట్రంలో 3.35 కోట్ల సాంపిల్స్‌ను పరీక్షించినట్లు తెలిపారు.

అదే సమయంలో ఫోర్త్ వేవ్ భయాల నేపథ్యంలో మాస్క్ వాడకాన్ని కొనసాగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదుకావడం లేదని మాస్క్‌ను నిర్లక్ష్యం చేయొచ్చని సూచిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాదిలోని పలు పట్టణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత పక్షం రోజులుగా గణనీయంగా పెరుగుతున్నాయని.. ఏపీలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read..

Avika Gor: ఎర్రటి గులాబీ అందాలతో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న అవికా.. ఇంత అందానికి ఫిదా కాని వారుంటారా

Pawan Kalyan : స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. శరవేగంగా హరిహర వీరమల్లు షూటింగ్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటో..