ఉత్తరాంధ్రలో పొలిటికల్ సునామీ.. ఎవరికి కరువు, ఎవరికి కుండపోత?

ఉత్తరాంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. బొత్స మేనల్లుడు మజ్జి శ్రీను టీడీపీలో చేరిక వైసీపీకి భారీ షాకిచ్చింది. దీనితో విజయనగరంలో రాజకీయ సమీకరణాలు మారాయి. టీడీపీ స్థానిక ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావించి వ్యూహాలు రచిస్తుండగా, వైసీపీ పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. బొత్స కుటుంబంలోనూ కలకలం రేగింది. ఈ పరిణామాలు రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

ఉత్తరాంధ్రలో పొలిటికల్ సునామీ.. ఎవరికి కరువు, ఎవరికి కుండపోత?
Uttarandhra Politics

Updated on: Sep 15, 2026 | 9:47 PM

ఉత్తరాన యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అభివృద్ధి మంత్రంతో, బీసీ తంత్రంతో దూకుడు పెంచిన పార్టీలు లోకల్‌బాడీ ఎన్నికల్లో స్కోరు పెంచుకోడానికి ఎత్తులమీద ఎత్తులు వేస్తున్నాయి. తర్వాతొట్టే ఫైనల్స్‌ లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మూడు ఉమ్మడి జిల్లాల్లో కుటుంబ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బలగాల్ని మోహరిస్తున్నాయి. స్థానికసంస్థల ఎన్నికల వేళ ఉత్తరాంధ్రలో మారుతున్న రాజకీయ సమీకరణం..! ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో లేటెస్ట్ సెన్సేషన్ ఏంటి అంటే, ఆయాచితంగా ఉత్తరాంధ్ర వైపే చూడ్డం అలవాటైపోయింది మనకు. ఎందుకంటే, డెవలప్‌మెంట్ ఐనా, పాలిటిక్స్ అయినా జరుగుతున్న పరిణామాలన్నీ అటువైపే కదా కేంద్రీకృతం అవుతున్నాయి? బొత్స మేనల్లుడు మజ్జి శీను పార్టీ మారడం నుంచి, సీదిరి అప్పలరాజు అరెస్ట్ కావడం, కింజరపు బ్రాండ్‌ మీదొస్తున్న కొత్తకొత్త ఊహాగానాల నుంచి గుడివాడ అమర్నాథ్‌ పంచుల దాకా… అన్నీ కలిసి, ఆ మూడు ఉమ్మడి జిల్లాలే వీరలెవల్లో ట్రెండ్‌ అవుతున్నాయిప్పుడు. అందుకే, ఆ మూలన, ఉత్తరాంధ్ర పక్క సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఏదో జరుగుతోంది అనే సిగ్నల్స్ గట్టిగానే వస్తున్నాయి. అవును, అధికార- ప్రతిపక్షాలు పోటాపోటీ స్కెచ్చులతో ఉత్తరాంధ్రలో రాజకీయాన్ని సైలెంట్‌గా చాపకింద సర్దేస్తున్నారు. అసెంబ్లీ వార్‌కి సెమీఫైనల్స్‌గా భావిస్తున్న లోకల్‌బాడీ ఎలక్షన్స్‌కి అట్నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయా? కేవలం నాలుగు రోడ్లేసి.. ఊర్లు...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి