AP PGECET 2026 Result: ఏపీ పీజీఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసీఈటీ (AP PGECET)-2026 పరీక్షా ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు గురువారం (మే 14) సోషల్ మీడియా 'X' (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.

AP PGECET 2026 Result: ఏపీ పీజీఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!
Ap Pgecet 2026 Results

Edited By:

Updated on: May 15, 2026 | 1:50 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసీఈటీ (AP PGECET)-2026 పరీక్షా ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు గురువారం (మే 14) సోషల్ మీడియా ‘X’ (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం.

ఈ ఏడాది ఏపీ పీజీఈసీఈటీ పరీక్షకు మొత్తం 9,990 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 9,320 మంది విజయవంతంగా అర్హత సాధించారు. దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.29 శాతంగా నమోదైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల ప్రతిభ పట్ల విద్యాశాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. ఫలితాల విడుదలతో పాటు విద్యార్థుల ర్యాంక్ కార్డులను కూడా ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ పీజీఈసీఈటీ ఫలితాల అధికారిక పోర్టల్‌ను సందర్శించి, తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే వెసులుబాటు కల్పించారు. 9552300009 నంబర్‌కు సందేశం పంపడం ద్వారా అభ్యర్థులు తమ మార్కులు, ర్యాంకు వివరాలను సులువుగా తెలుసుకోవచ్చు.

ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. రాబోయే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రకటించనుంది.

మరిన్ని విద్య ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us