
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ శనివారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిచేస్తే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగుతుంది.
శనివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటలదాకా పంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లోని 18 డివిజన్లలోని 167 మండలాల్లో.. 2వేల 786 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో మధ్యాహ్నం వరకే పోలింగ్ నిర్వహించి..సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఫలితాల వెల్లడి తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. రెండవ విడతకి మొత్తం 3వేల 328 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 539 సర్పంచ్ స్థానాలు, 12వేల 604 వార్డులు రెండో విడతలో ఏకగ్రీవమయ్యాయి. అటు.. నాలుగో విడత నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో 17న మూడో విడత, 21న నాలుగోవిడత పోలింగ్ జరగబోతోంది.
ఇవి కూడా చదవండి :