AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈశ్వరయ్య అనే తహసీల్దార్‌ను శాస్వతంగా విధులు నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డికెటి భూముల (Land) అక్రమ బదలాయింపులపై ప్రభుత్వం (Government) సీరియస్‌గా ఉంది. ఈశ్వరయ్య కడప జిల్లా వీరపునాయనిపల్లె తహపీల్దార్‌గా డిప్యుటేషన్‌పై పని చేస్తుండగా, 2015 నుంచి 2017 సమయంలో అట్లూరు మండలంలో తహసీల్దార్‌గా పని చేశారు. అయితే ఆ సమయంలో భూ అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోఅప్పట్లోనే ఈశ్వరయ్య సస్పెండ్‌కు గురయ్యారు. 100 కోట్ల విలువచేసే వందల ఎకరాల భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపణ వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో సుధీర్ఘ విచారణ అనంతరం ఈశ్వరయ్యను శాస్వతంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు సిసిఎల్ఎ జాయింట్ సెక్రటరీ బాబు. ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి: