ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే “గడప గడపకు మన ప్రభుత్వం” పేరుతో ప్రతి ఇంటికి వెళ్తున్న మంత్రులు ఇప్పుడు మరో రకమైన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర( Bus Yatra in AP) చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టే యోచనలో ఉన్నారు. విశాఖపట్నం(Visakhapatnam) నుంచి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింతగా వివరించేందుకు, విస్తృత ప్రచారం చేసేందుకు బస్సు యాత్రను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగే అవకాశం ఉంది. యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సంబంధిత మంత్రులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమావేశాలు నిర్వహించేలా రూట్ మ్యాప్ నూ సిద్ధం చేశారు.
అయితే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మురుగు కాలువలు నిర్మించడం లేదని, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇంటి నిర్మాణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడుతున్నారు. అధికార పార్టీ వారికీ పథకాలు సరిగా అందడం లేదని, ఇలాగైతే తాము ప్రజల వద్దకు ఎలా వెళ్లగలమంటూ పల్నాడు, శ్రీకాకుళం జిల్లాల్లో వైకాపా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మంత్రులు బస్సు యాత్ర చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇదీ చదవండి
Andhra Pradesh: జగన్ సర్కార్ అనూహ్యం నిర్ణయం.. ఆ జిల్లా పేరు మార్పు..