ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు మరో షాక్.. అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన మంత్రులు..

|

Jan 30, 2021 | 1:52 PM

AP Local Body Elections: ఏపీలో పంచాయితీ ఎన్నికలు పొలిటికల్ హీట్‌కు రాజుకుంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి..

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు మరో షాక్.. అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన మంత్రులు..
Follow us on

AP Local Body Elections: ఏపీలో పంచాయితీ ఎన్నికలు పొలిటికల్ హీట్‌కు రాజుకుంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్యలకు దిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సభా హక్కుల ఉల్లంఘన నోటిసులు ఇచ్చారు. శాసనసభ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు అందజేశారు. ఎస్ఈసీ తన పరిధిని మించి వ్యవహరించారని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. నిమ్మగడ్డ తీరును తప్పు పడుతూ గవర్నర్‌ హరిచందన్‌ను కూడా కలిసే యోచనలో ఉన్నారు రాష్ట్ర మంత్రులు.

అలాగే ప్రజా ప్రతినిధుల విషయంలో ఇష్టానుసారంగా ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారనే అంశంపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. ఏకగ్రీవాలపై ప్రభుత్వ ప్రకటనను తప్పు పట్టిన నిమ్మగడ్డ.. నిబంధనలకు విరుద్దంగా విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోపై పెదవి విప్పకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. కాగా, ఎస్ఈసీ పరిధిపై కోర్టును ఆశ్రయించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది.