AP Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

|

Sep 23, 2024 | 4:13 PM

ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం.. మరొకటి దక్షిణ కోస్తా మయన్మార్, పొరుగు ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం తూర్పు-పశ్చిమ ద్రోణితో అనుసంధానించబడి సోమవారం మధ్య బంగాళాఖాతం..

AP Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
Ap Rains
Follow us on

ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం.. మరొకటి దక్షిణ కోస్తా మయన్మార్, పొరుగు ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం తూర్పు-పశ్చిమ ద్రోణితో అనుసంధానించబడి సోమవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒకే ఉపరితల ఆవర్తనంగా కలిసిపోయి సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి.. ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశము ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రేపు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశము చాలా ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశము ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశము ఎక్కువగా ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-

ఇది చదవండి: ఏపీలో మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త.. ఇది కదా కావాల్సింది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..