Andhra Pradesh: ఏపీకి పెట్టుబడుల సునామీ.. సీఐఐ సమ్మిట్ తొలిరోజే రూ. 5.84 లక్షల కోట్ల డీల్స్..

తొలిరోజే ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. లోకల్ కంపెనీల దగ్గర నుంచి అంతర్జాతీయ పరిశ్రమల వరకు.. ఎనర్జీ రంగం దగ్గర నుంచి ఆటోమొబైల్ రంగం వరకు.. అనేక పరిశ్రమలు క్యూ కట్టాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు.. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒక్కరోజులో జరిగిన ఒప్పందాల విలువ.. వాటి ద్వారా రాబోతున్న ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుందాం..

Andhra Pradesh: ఏపీకి పెట్టుబడుల సునామీ.. సీఐఐ సమ్మిట్ తొలిరోజే రూ. 5.84 లక్షల కోట్ల డీల్స్..
Cii Summit Andhra Pradesh Investments

Updated on: Nov 12, 2026 | 9:38 PM

సీఐఐ సమ్మిట్‌లో తొలిరోజు ఏకంగా రూ.5 లక్షల 84 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఒక్కరోజే 88 ఒప్పందాలు జరగ్గా.. అందులో 73 ఎంఓయూలు, 15 జీవోలు ఉన్నాయి. వీటి ద్వారా లక్షా 7 వేల 693 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2 లక్షల 73 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ భారీ ప్రాజెక్టు రాబోతోంది. శ్రీకాకుళం జిల్లాలో రష్మీ మెటలర్జికల్ ఇండస్ట్రీ రూ.18 వేల 500 కోట్లు.. అనంతపురంలో కియా మోటార్స్ రూ.18 వేల 878 కోట్లు.. కడపలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు MOU కుదిరింది.

ఎనర్జీ రంగంలో భారీగా పెట్టుబడులు

రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో లక్షా 65 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. గ్రీన్‌కో రూ.45 వేల కోట్లు, క్లీన్‌మ్యాక్స్ రూ.41 వేల కోట్లు.. మేఘా ఇంజినీరింగ్ రూ.36 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగంలో రూ.4 వేల 300 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ఫ్యాబ్రిక్ సంస్థ ద్వారా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఆటోమొబైల్, ఈవీ రంగంలో రూ.21 వేల 285 కోట్ల పెట్టుబడులు.. కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగంలో రూ.19 వేల 995 కోట్ల పెట్టుబడులు.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.4 వేల 770 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది ఏపీ సర్కార్.

పెట్టుబడులకు ఏపీ బెస్ట్ డెస్టినీగా మారిందని కూటమి నేతలు అంటున్నారు. తమ విధానం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ మంత్రి లోకేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. పెట్టుబడిదారులు వస్తున్నారు సరే.. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారితే.. ఇన్వెస్టర్లలో ఆందోళన ఏర్పడితే..? ఇలాంటి వాటికి సమాధానంగానే త్వరలో కొత్త చట్టం తెస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ ద్వారా పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తామమంటున్నారు.

2024 జూన్ నుంచి ఇప్పటివరకు ఏపీకి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా.. వీటిలో రూ.17.2 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టులు ఒప్పందాల దశకు చేరుకున్నాయి. రూ.7.1 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశలో ఉన్నాయి. రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు గనుక గ్రౌండింగ్ అయితే.. రూ.19.3 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us