Andhra Pardesh: అమరావతి రైతుల పాదయాత్రకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

|

Sep 09, 2022 | 12:31 PM

అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా పర్మిషన్ నిరాకరించిన పోలీసులపై సీరియస్‌ కామెంట్స్ చేసింది.

Andhra Pardesh: అమరావతి రైతుల పాదయాత్రకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
Ap High Court
Follow us on

Amaravati Farmers: అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి(Arasavilli) వరకు చేపట్టిన రాజధాని రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది.  గురువారం రాత్రి ఈ  పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ డీజీపీ  ఉత్తర్వులు విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేసిన పిటిషన్‌ను శుక్రవారం మొదటికేసుగా విచారించింది హైకోర్టు. రాజకీయ నాయకులు వేల మందితో పాదయాత్ర చేయొచ్చు కానీ.. 600 మంది రైతుల చేయకూడదా అని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది. ఢిల్లీలో సమస్యలపై వేలాది మంది ర్యాలీలు చేస్తుంటే.. అక్కడి పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారని.. ఇక్కడ 35 వేల మంది రైతుల్లో కేవలం 600 మంది చేస్తున్న పాదయాత్రకు బందోబస్తు కల్పించలేరా అని సీరియస్ కామెంట్స్ చేసింది.  పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.  పోలీసులకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని రైతులను హైకోర్టు ఆదేశించింది. దరఖాస్తు పరిశీలించి అనుమతులు ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..