AP Government: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి భారీగా పెరుగుతోంది. సాధారణ ప్రజల నుంచి నాయకుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో ఏపీలోని జగన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలో కరోనా ఉదృతి నేపథ్యంలో నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలల్లో దర్శనాలను 50 శాతం తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతరాలయ దర్శనాలు, అన్నదానాలు, ఉచిత ప్రసాదాల వితరణను నిలిపివేయాలంటూ ఆలయ అధికారులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిత్య అన్నదానం, ఉచిత ప్రసాదంతో పాటు అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు.
ఈ మేరకు ఈవో భ్రమరాంభ మాట్లాడుతూ.. ప్రస్తుతం 50 శాతం ప్రత్యక్ష దర్శనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆన్లైన్లో పరోక్ష దర్శనాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా క్యూలైన్లలో శానిటేషన్ భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గుడికి వచ్చే భక్తుల కోసం ఆన్లైన్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో మార్గదర్శకాలు పాటించని సిబ్బందికి ఫైన్స్ తప్పవని హెచ్చరించారు. మాస్కులు లేకుండా గుడికి వచ్చే భక్తులకు కూడా ఫైన్స్ వేసేలా చర్యలు చేపడుతున్నట్లు భ్రమరాంభ తెలిపారు.
Also Read: