AP government: పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 50 వేల ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు

|

Mar 16, 2021 | 12:55 PM

ఏపీ సర్కార్ పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. 50 వేల ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి అవాస్ యోజన.. వైఎస్సార్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఈ ఇళ్ల నిర్మాణం జరగనుంది.

AP government: పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 50 వేల ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు
Ap Housing Scheme
Follow us on

ఏపీ సర్కార్ పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. 50 వేల ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి అవాస్ యోజన.. వైఎస్సార్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఈ ఇళ్ల నిర్మాణం జరగనుంది. అయితే పట్టణ స్థానిక సంస్థలు – అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలోకి రాని ప్రాంతాల్లో ఈ గృహల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఇళ్ల నిర్మాణాల నిధుల విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఒక్కో ఇంటికి గరిష్ఠంగా రూ. లక్షా 80 వేల ఖర్చు అవుతుందని పేర్కొంది. ఇందులో రూ. 78 వేలు కేంద్ర ప్రభుత్వం.. రూ. 72 వేలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించింది. మరో 30 వేలు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొందవచ్చని పేర్కింది.

 రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఇటీవల అధికారులను ఆదేశించారు. మంజూరైన ఇళ్లకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్‌ ఈ నెల ముగిసేలోగా కంప్లీట్ చేయాలని సూచించారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు మైండ్‌లో పెట్టుకుని పనిచేయాలని పేర్కొన్నారు. సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీల్లో ఇళ్ల నిర్మాణం త్వరితగతిన జరిగేందుకు అవసరమై నీరు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించడంపై  దృష్టి సారించాలని చెప్పారు. ఇళ్లు కట్టుకోవడానికి కరెంటు, నీళ్ల వంటి సదుపాయాలు లేవనే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఉండకూడదని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Also Read:

MLA Kethireddy Venkatarami Reddy: మొన్నటివరకు సోషల్ మీడియాలో క్రేజ్.. ఇప్పుడు హైకమాండ్ క్లాస్..!

Black Magic: ఎండు చేపలు, అన్నం ముద్దలతో క్షుద్రపూజలు.. ఆ పేపర్లలో ఏం గీశారంటే..?