AP News: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే.. ఇది కదా కావాల్సింది

| Edited By: Ravi Kiran

Aug 12, 2024 | 5:12 PM

రైతన్నకు పెద్దపీట వేస్తూ ఏపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. రైతుకి ఎలాంటి నష్టం జరగకుండా అండగా ఉండేందుకు అవసరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. అన్నదాతకు ఆర్ధిక కష్టాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిలబడేందుకు భరోసా కల్పిస్తుంది.

AP News: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే.. ఇది కదా కావాల్సింది
Farmers
Follow us on

రైతన్నకు పెద్దపీట వేస్తూ ఏపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. రైతుకి ఎలాంటి నష్టం జరగకుండా అండగా ఉండేందుకు అవసరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. అన్నదాతకు ఆర్ధిక కష్టాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిలబడేందుకు భరోసా కల్పిస్తుంది. అందులో భాగంగానే ఇకపై ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు వేయనున్నారు. రైతులు పడిన కష్టాలు మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోనున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ధాన్యం అమ్మిన 48 గంటల్లోపు సొమ్ము ఖాతాల్లో పడే ఏర్పాటు చేస్తున్నారు. పంటల బీమా ప్రీమియం కూడా ఇకపై ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను విడుదల చేశారు. రూ. 1674 కోట్లలో ధాన్యం కొనుగోలు బకాయిలలో కూటమి ప్రభుత్వం వచ్చాక.. రూ. వెయ్యి కోట్ల నిధులు విడుదల చేయగా.. మిగిలిన రూ. 674 కోట్లను పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ ఇవాళ విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతులకు రూ. 472 కోట్లు ఒకేసారి రైతుల ఖాతాల్లో వేసే ఏర్పాటు చేశారు.

ధాన్యాన్ని అమ్ముకున్నా చేతికి డబ్బు రావాలంటే రైతులకు అవస్థలు తప్పట్లేదు. నిబంధనలకు లోబడి రైతులు ధాన్యం అమ్ముకున్నా.. ప్రతి అడుగులో అక్రమాలుతో రైతు కడుపుకు కోత తప్పలేదు. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల వల్ల ఇప్పటికే భారీ నష్టం వచ్చింది. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని రైతులు గగ్గోలు పెట్టినా.. పట్టించుకునే వారే ఎవరు ఉండరు. మిల్లర్ వద్దకు ధాన్యాన్ని తరలిస్తే రెండు రోజుల తర్వాత రమ్మనడం, స్లిప్పు తీసుకువెళ్తే తమ శాతం తేడా ఉందని చెప్పడం.. రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తూ మరింత హింసించేవారు. వీటన్నిటికి కూటమి ప్రభుత్వం చెక్ పెట్టనుంది. కౌలు రైతులకు సైతం గౌరవం దక్కే ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇస్తుంది. అందులో భాగంగానే పండించిన పంటకు సకాలంలో చెల్లింపులు చేయాలన్న ఆలోచనను తెరపైకి తెచ్చింది.

రైతు భరోసా కేంద్రాలను రైతు సహాయ కేంద్రాలుగా మార్చి ఈ పంట ద్వారా సీసీఐసీ కార్డులు ఇచ్చే ఏర్పాటు చేసి కౌలు రైతులందర్నీ ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికీ 62 శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. రైతు సహాయక కేంద్రాలకు వెళ్తే సంతృప్తి కలిగే విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకుని రావాల్సిన అవసరం కూడా ఉంది. గోతాలు, ధాన్యం రవాణా విషయంలో రైతులకు అండగా నిలవడంతో పాటు వ్యవసాయ పరికరాల కోసం రైతులకు 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..