చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. సంద్రంలో వల విసిరిన జాలర్లకు కాసేపటికే.. వల బరువెక్కింది.. అబ్బా.. ఏదో భారీ చేపే పడుంటదని జాలర్లంతా సంబరపడిపోయారు. అతి కష్టం మీద వలను ఒడ్డుకు చేర్చారు. తీరా ఆ వలలో పడిన దాన్ని చూసి ఉసూరుమంటూ నిట్టూర్చారు. అయితేనేం.. తినడానికి పనికి రాకపోయినా.. మరో రకంగా కాసుల పంట కురిపించింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలంలోని తండి శివారువాడ పాలెంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. ఐదుగురు మత్స్యకారులు కలిసి వేటకు వెళ్లి సముద్రంలో వల విసిరారు. అంతలోనే వారి వలలో భారీ చేప చిక్కుకుంది. దీంతో ఒడ్డుకు తెచ్చి చూడగా అది భారీ తిమింగలం. దాన్ని సముద్రంలోకి వదిలేద్దామంటే అప్పటికే మృతిచెందిందని గుర్తించారు మత్స్యకారులు. ఇకపోతే, తిమింగలం బరువు సుమారు 1200 కిలోలుంటుందని.. దాన్ని పప్పరమేను అంటారని చెప్పారు. దీని ధర భారీగానే ఉంటుందని చెప్పారు. అయితే ఆ తిమింగలం తినడానికి పనికి రాదని, కానీ దాని నుంచి తీసే నూనెలో ఔషధ గుణాలు ఉంటాయని జాలరులు వివరించారు.
Also Read: Viral Video: ద్యావుడా! మరీ ఇంత మతిమరుపా.. ఈ యువతి చేసిన పని చూస్తే మైండ్ బ్లాంకే!