AP Electricity Charges: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..

|

Jan 07, 2025 | 6:05 PM

ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాగూర్ నేతృత్వంలో ఈఆర్సీ అధికారులు విజయవాడలోని "A" కన్వెన్షన్ సెంటర్‌లో ఈ రోజు, రేపు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు.. మంగళవారం ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు ప్రత్యక్షంగా అభిప్రాయం సేకరించిన అధికారులు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం నాలుగున్నరవరకూ వర్చువల్‌ విధానంలో అభిప్రాయాలు సేకరించారు.

AP Electricity Charges: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
Ap Electricity Charges
Follow us on

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై APERC ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్‌ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి.. ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాగూర్ నేతృత్వంలో ఈఆర్సీ అధికారులు విజయవాడలోని “A” కన్వెన్షన్ సెంటర్‌లో ఈ రోజు, రేపు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు.. మంగళవారం ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు ప్రత్యక్షంగా అభిప్రాయం సేకరించిన అధికారులు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం నాలుగున్నరవరకూ వర్చువల్‌ విధానంలో అభిప్రాయాలు సేకరించారు. ఈ నెల 10న కర్నూలులో ఇదే తీరులో విచారణ జరుగుతుందని తెలిపింది ఏపీఈఆర్‌సీ..

మరోవైపు విద్యుత్‌ రంగంపై ప్రభుత్వ తీరుని నిరసిస్తూ విజయవాడలో ఆందోళనకు దిగారు వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు… ఛార్జీలపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామంటున్న అధికారులు.. ప్రజల అభిప్రాయం మేరకు ఛార్జీలపై ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నారా..? అని ప్రశ్నించారు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన నియంత్రణ మండలి..ప్రభుత్వం, పంపిణీ సంస్థల ప్రతిపాదనలను మాత్రమే ఆమోదిస్తోందని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ ఒప్పందాల్లో అక్రమాలు ఉన్నాయని ఆరోపించిన కూటమి పార్టీల నేతలు.. ఆ ఒప్పందాలనే ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు లెఫ్ట్‌పార్టీల నేతలు.. సెకీతో ఒప్పందాలు, స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..