Ap Sec Petition Hearing: ఎన్నికల కమిషనర్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ.. ఈనెల 18కి వాయిదా

|

Jan 12, 2021 | 6:11 PM

Ap Sec Petition Hearing: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంళవారం విచారణ చేపట్టింది...

Ap Sec Petition Hearing: ఎన్నికల కమిషనర్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ.. ఈనెల 18కి వాయిదా
Follow us on

Ap Sec Petition Hearing: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంళవారం విచారణ చేపట్టింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వగా, సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈప్పీలు కోసం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌.. విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈనెల 8న షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను నిర్వహించలేమని, ఈ షెడ్యూల్‌ ప్రకటనను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర సర్కార్‌ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టి ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేసింది.

ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ నిర్ణయం సరైనదిగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని ఎస్‌ఈసీ పరిగణలోకి తీసుకోలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది.

Serum Institute covishield Vaccine: తక్కువ ధరకే కోవిడ్‌ వ్యాక్సిన్‌.. సీరం ఇనిస్టిట్యూట్‌ కీలక నిర్ణయం