Pawan Kalyan: రేట్లు పెంచి అమ్మితే ఊరుకునేది లేదు.. వారికి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్..

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ అమ్మకాల విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ అయ్యారు. ఈ మేరకు లిక్కర్‌ షాప్‌ యజమానులకు ఆయన వార్నింగ్‌ ఇచ్చారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధం.. మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు అంటూ.. పవన్‌ కల్యాణ్‌ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Pawan Kalyan: రేట్లు పెంచి అమ్మితే ఊరుకునేది లేదు.. వారికి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్..
AP Deputy CM Pawan Kalyan

Updated on: Feb 03, 2026 | 12:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ అమ్మకాల విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ అయ్యారు. ఈ మేరకు లిక్కర్‌ షాప్‌ యజమానులకు ఆయన వార్నింగ్‌ ఇచ్చారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధం.. మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు అంటూ.. పవన్‌ కల్యాణ్‌ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. లిక్కర్‌ షాపుల్లో మద్యం బాటిళ్లు MRP కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని.. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. కాకినాడ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని.. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు.. ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిఘా పెట్టి.. అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని పవన్‌ కల్యాణ్ ఆదేశించారు. అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

చర్యలు తీసుకోండి..

ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ఇలా పోస్ట్ చేశారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎం.ఆర్.పి కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు అందింది. కాకినాడ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్దం. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుంది. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని..’’ స్పష్టం చేశారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us