AP CM YS Jagan: ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ.. ఎందుకంటే.?

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి టీకా ఉత్సవ్ కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రానికి మరో 60 లక్షల...

AP CM YS Jagan: ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ.. ఎందుకంటే.?
Follow us

|

Updated on: Apr 16, 2021 | 5:19 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి టీకా ఉత్సవ్ కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రానికి మరో 60 లక్షల కోవిడ్ టీకా డోసులను పంపాలని కోరారు. అంతేకాకుండా ఈ నెల 9వ తేదీన రాసిన లేఖకు స్పందించి ఏపీకి 6 లక్షల టీకా డోసులను పంపించినందుకు ప్రధాని మోదీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. అటు టీకా ఉత్సవ్‌లో భాగంగా 14వ తేదీన ఒక్క రోజే ఏపీలో 6.28 లక్షల మందికి టీకా వేసినట్లు ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు.

కాగా, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో వ్యాక్సినేషన్‌ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని.. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ డోసులు ఇచ్చామని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ఇదంతా కూడా గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ వల్లే సాధ్యమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా పరీక్షల సంఖ్య పెంచామని, ఏ లోటు లేకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. 50 కుటుంబాలకు ఒకరిని చొప్పున నియమించిన వాలంటీర్ల ద్వారా ప్రతీ వ్యక్తికి వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని.. వచ్చే మూడు వారాల్లో 45 సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరికి టీకా వేస్తామని తెలిపారు. అందులో భాగంగానే ఏపీకి 60 లక్షల డోసులు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం జగన్ కోరారు.

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..

Jagan Letter

Jagan Letter

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో