Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..

|

Feb 03, 2021 | 4:54 PM

ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు- నేడు కార్యక్రమం రెండో విడతకు సిద్ధం కావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. నాడు - నేడు మొదటి విడతలో ఎదురైన...

Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..
Follow us on

Naadu Nedu Second Phase :  ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు- నేడు కార్యక్రమం రెండో విడతకు సిద్ధం కావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. నాడు – నేడు మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా రెండో విడత ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి  ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు సూచించారు. రెండో విడత పనులను ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు.

డిసెంబర్‌ 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేసుకున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రెండో విడత కోసం సుమారు రూ.4,446 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొదటి విడత కోసం సుమారు రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్నదని, పాఠశాలను బాగుకు ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అధికారులు అంటున్నారు.

పాఠశాల తిరిగి ప్రారంభంతోపాటు విద్యార్థుల హాజరుపై అధికారుల నుంచి సీఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల  హాజరుపై యాప్‌ను రూపొందించారా..? లేదా? అని  అధికారులను ఆయన ప్రశ్నించారు.  ఫిబ్రవరి 15వ తేదీ నుంచి విద్యార్థుల హాజరుపై యాప్‌ ద్వారా వివరాలు సేకరిస్తామని అధికారులు పేర్కొన్నారు.

విద్యార్థులు గైర్హాజరయితే వారి తల్లిదండ్రులకు సందేశం వెళ్లాలని, రెండో రోజు నేరుగా వలంటీర్‌ను పంపి వివరాలు తెలుసుకోవాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి :

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..

నగరంలో నకిలీ నక్సలైట్.. బడా వ్యాపారవేత్తలే అతడి టార్గెట్.. ఓ వ్యక్తిని బెదిరిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్..