Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలే..

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలే..
Rains

Updated on: Sep 12, 2026 | 1:19 PM

నిన్న దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంతం.. ఈరోజు, 12 సెప్టెంబర్ 2026 ఉదయం 05:30 గంటల సమయానికి దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. తిరిగి ఉదయం 08:30 గంటలకు అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఇక సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, రాజ్‌గఢ్, బేతుల్, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలపై గోపాల్‌పూర్ మీదుగా పయనిస్తోంది. ఆ తర్వాత తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్లి, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ సింధుశాఖ వరకు ఉన్న ద్రోణి అలాగే కొనసాగుతోంది. ఇది ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది.

వాతావరణ సూచనలు

ఈరోజు తెలంగాణలోని ఉత్తర ఈశాన్య ప్రాంతంలో చాలా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశముంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని ఉత్తర మరియు తూర్పు ఈశాన్య జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు, మరియు ఉత్తర ఈశాన్య తెలంగాణలోని మిగిలిన జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు,రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,  30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఏపీలో వర్షాలు..

దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ – వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్‌గఢ్,విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50-60 కి.మీ., దక్షిణ కోస్తా తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో మోస్తు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీవర్షాలు పడనున్నాయి. విజయనగరం,మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. అనకాపల్లి,కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించింది.  ఈ క్రమంలోప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us