Kannababu: అందుకే.. టీడీపీ నేతలకు కడుపుమంట: మంత్రి కన్నబాబు కౌంటర్

రాష్ట్రంలో గంజాయిసాగు జరగడం లేదు. అందుకే టీడీపీ నేతలకు కడుపుమంట. మంత్రి కన్నబాబు కౌంటర్ ఇది. టీడీపీకి భూములంటే

Kannababu: అందుకే.. టీడీపీ నేతలకు కడుపుమంట: మంత్రి కన్నబాబు కౌంటర్
Kannababui

Updated on: Oct 06, 2021 | 12:46 PM

AP Minister Kannababu: రాష్ట్రంలో గంజాయిసాగు జరగడం లేదు. అందుకే టీడీపీ నేతలకు కడుపుమంట. మంత్రి కన్నబాబు కౌంటర్ ఇది. టీడీపీకి భూములంటే అమరావతి భూములు. రైతులంటే అమరావతి రైతులే అని విమర్శించారు. రోజుకో రకమైన ఆందోళనలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. రైతులు ఆనందంగా ఉండటం చూడలేక టీడీపీ నేతలకు కడుపు మంట మొదలైందని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

క్రాప్‌ హాలీడే ప్రకటించారని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. టీడీపీ హయాంలో రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక రైతులకు ఏ కష్టం రానివ్వకుండా చూస్తున్నారని, రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు, ఆయన తనయుడు విశ్రాంతి తీసుకుంటూ..టీడీపీ శ్రేణులతో సీజన్‌కో అవతారం ఎత్తించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇవాళ కాకినాడలో మంత్రి మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు.. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని కన్నబాబు చెప్పరు. రైతాంగం కోసం సీఎం జగన్ వ్యవస్థలను నిర్మిస్తున్నారు కన్నబాబు.

రాష్ట్రంలో పంటల సాగు బాగుంది.. రైతులు కూడా బాగున్నారు. రైతుల ఆనందం చూడలేక రాష్ట్రంలో టీడీపీ నాయకులు మాత్రమే బాధపడుతున్నారు. అలాంటి గంజాయి సాగును రాష్ట్రంలో ఒప్పుకోం. అలాంటి సాగుపై ఉక్కుపాదం మోపుతాం అని కన్నబాబు వార్నింగ్ ఇచ్చారు. గత మూడు నెలల నుంచి ఎస్పీ దాడులు నిర్వహిస్తే..తూర్పు గోదావరి జిల్లాలో గంజాయి రవాణా కార్యక్రమాన్ని ప్రతి రోజు అడ్డుకుంటున్నారు కన్నబాబు.

Read also: Goutham Reddy: డ్రోన్‌తో గౌతమ్ రెడ్డికి పూలమాల.. ఆత్మకూరులో మంత్రికి వైసీపీ నేతల వినూత్న స్వాగతం

Loading...
Unable to load recommendations.
Follow Us