AP Rains: మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు.. ఏపీ ప్రజలకు అలెర్ట్.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..

|

Dec 12, 2022 | 5:54 PM

తమిళనాడు, కర్ణాటక, కేరళపై ఉన్న ఉపరితల అవర్తనం ప్రస్తుతం ఉత్తర కేరళ, పొరుగు ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి..

AP Rains: మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు.. ఏపీ ప్రజలకు అలెర్ట్.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Ap Rains
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వీడేలా కనిపించట్లేదు. మరో మూడు రోజులు రాష్ట్రమంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళపై ఉన్న ఉపరితల అవర్తనం ప్రస్తుతం ఉత్తర కేరళ, పొరుగు ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర కేరళ- కర్ణాటక తీరంలో ఆగ్నేయానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉద్భవించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఒక అల్పపీడనం డిసెంబర్ 13 నాటికి అదే ప్రాంతంలో ఏర్పడి, ఆ తర్వాత భారత తీరానికి దూరంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది.

రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

  • ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:-
    ————————————————–

ఈరోజు :- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి :– తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

  • దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
    ———————————-

ఈరోజు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. అటు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు ఒకట్రెండు ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రేపు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:-
———————————————————

ఈరోజు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. అలాగే భారీవర్షాలు ఒకట్రెండు ప్రాంతాల్లో కురువనున్నాయి.

రేపు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.