Muncipal Officers Notices: మాజీ మంత్రి కాల్వల శ్రీనివాసులుకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజులు రాయదుర్గంలో ఉండవద్దని మంగళవారం అధికారులు జారీ చేసిన నోటీసులలో పేర్కొన్నారు. స్థానికంగా ఓటు హక్కు లేకపోవడంతో అధికారులు కాల్వ శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఓటు హక్కు లేనివారు ఎన్నికలు ముగిసే వరకు మున్సిపాలిటీ పరిధిలో ఉండరాదని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
కాగా, రాష్ట్రంలో మొత్తం 12 నగర పాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో బుధవాంర పోలింగ్ నిర్వహనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్థలో ఎన్నికలపై హైకోర్టు సోమవారం స్టే ఇవ్వడంతో పోలింగ్ ను తాత్కాలికంగా పక్కనపెట్టేశారు. ఈ కేసులో రాష్ట్ర పురపాలక శాఖ మంగళవారం హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సమాచారం.
OTP: బ్యాంకు లావాదేవీలు, ఈ-కామర్స్, ఆధార్ వెరిఫికేషన్ తదితర ఓటీపీలు రావడం లేదా..? కారణం ఇదేనట..!