Tirupati: తిరుపతిలో దారుణం.. జనసేన కార్యకర్తను కత్తులతో నరికి చంపిన దుండగులు..

ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) చిత్తూరు (Chittoor)  జిల్లాలో దారుణం జరిగింది.  తిరుపతి (Tirupati) నగరానికి చెందిన  ఓ జనసేన పార్టీ (Janasena ) కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు.

Tirupati: తిరుపతిలో దారుణం.. జనసేన కార్యకర్తను కత్తులతో నరికి చంపిన దుండగులు..

Updated on: Jan 30, 2022 | 10:36 AM

ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) చిత్తూరు (Chittoor)  జిల్లాలో దారుణం జరిగింది.  తిరుపతి (Tirupati) నగరానికి చెందిన  ఓ జనసేన పార్టీ (Janasena ) కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు.  గుర్తు తెలియని  దుండగులు అతడిని అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. తిరుపతి  సమీపంలోని పేరూరు చెరువు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తిరుపతిలోని గాంధీపురానికి చెందిన సుహానా బాషా జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.  అయితే గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. కత్తులతో అతి కిరాతకంగా హతమార్చారు. తిరుపతి శివార్లలోని పేరూరు చెరువపై సుహానా బాషా మృతదేహాన్ని  కనుగొన్నారు.

కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారితో పాటు స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. బాషాను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  కాగా స్థానిక జనసేన నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సుహాన్ బాషాను హ‌త్య చేసి పారిపోయిన దుండగుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

Coronavirus: దేశంలో అదుపులోకి వస్తోన్న కరోనా మహమ్మారి.. మరణాలు మాత్రం భారీగానే .. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

Kurnool: కర్నూలు జిల్లాలో విషాదం.. ప్రేమకు అడ్డు చెప్పిన పెద్దలు.. ఎడబాటుతో ప్రేమికుల బలవన్మరణం..

Guntur: దొంగతనానికి వచ్చి దర్జాగా బెడ్ పై నిద్రపోయాడు.. తెల్లారగానే ఏం జరిగిందో తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us