Coronavirus: ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు… రికార్డ్‌ స్థాయిల్లో కేసులు నమోదు

|

Apr 19, 2021 | 6:08 PM

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్ని చర్యలు...

Coronavirus: ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు... రికార్డ్‌ స్థాయిల్లో కేసులు నమోదు
Ap Corona Cases
Follow us on

AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 37,765 మంది శాంపిళ్లను తీసుకుని పరీక్షించగా, అందులో కొత్తగా 5,963 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 968000 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఆరుగురు, చిత్తూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరులో, వైఎస్‌ కడప, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించగా, అనంతపురంలో ఒకరు చొప్పున మొత్తం 17 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 2,569 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 9,09,615 కాగా, మృతి చెందిన వారి సంఖ్య7,437 మంది ఉన్నారు. ఇక ప్రస్తుతం కరోనాతో 48,053 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, ఏపీలో కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం మరిన్ని చర్యలకు దిగుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ జరుగుతుండగా, మరో వైపు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో మాస్కులు ధరించని వారిపై అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.

అలాగే కరోనా కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులను ప్రకటించింది. ఈ సెలవులను మంగళవారం నుంచి ఇస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమావేశం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగానే జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేశారు

Ap Covid

ఇవీ చదవండి: Delhi Lock Down: లాక్ డౌన్ విధించడంతో వైన్ షాపుల వద్ద ఎగబడ్డ మందుబాబులు!

త్వరలో గచ్చిబౌలి నుంచి విమానాశ్రయం వరకు మెట్రో రైలు… 31కి.మీ మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం