Jagananna Thodu Scheme: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. లబ్దిదారుల అకౌంట్లో ఆ డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్

|

Oct 19, 2021 | 5:06 PM

Jagananna Thodu Scheme: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రవేశపెట్టిన 'జగనన్న తోడు' పథకంలో..

Jagananna Thodu Scheme: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. లబ్దిదారుల అకౌంట్లో ఆ డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్
Follow us on

Jagananna Thodu Scheme: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ పథకంలో భాగంగా లబ్దిదారుల వడ్డీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 16.36 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర సర్కార్‌ ఇప్పటి వరకు 9.05 లక్షల మందికి రూ. 950 కోట్ల రుణాలను అందించింది. మొదటి విడత ఈ పథకం కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ధి చేకూరనుంది.

ఈ జగనన్న తోడు స్కీమ్‌ కింద తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఏడాది రూ. 10 వేలు వడ్డీ లేని రుణాలను అందజేస్తోంది ప్రభుత్వం. ఈ మొత్తానికి సంబంధించి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. సకాలంలో రుణాన్ని చెల్లించే వారికి తిరిగి రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. వాస్తవానికి మంగళవారం జగనన్న తోడు కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ బుధవారానికి వాయిదా వేశారు. మిలాద్‌-ఉన్‌-నబీ పండగ సెలవు కావడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

ఇవీ కూడా చదవండి:

Tirumala Tirupati: వారికి ఆ దర్శనాలను ఇంకా పునరుద్దరించలేదు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

Telugu Academy Deposits Case: తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో మరొక కీలక నిందితుడి అరెస్ట్