Andhra University VC : కులసంఘం సమావేశానికి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి హాజరవడంపై ఫిర్యాదులు, ఎస్ఈసీ కన్నెర్ర

|

Mar 02, 2021 | 2:31 PM

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మన్ననలు పొందిన ప్రముఖ విశ్వ విద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీకి రాజకీయ మకిలీలు అంటాయి. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓ హోటల్ లో జరిగిన కుల సంఘం సమావేశానికి..

Andhra University VC : కులసంఘం సమావేశానికి  ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్  ప్రసాదరెడ్డి హాజరవడంపై ఫిర్యాదులు, ఎస్ఈసీ కన్నెర్ర
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మన్ననలు పొందిన ప్రముఖ విశ్వ విద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీకి రాజకీయ మకిలీలు అంటాయి. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓ హోటల్ లో జరిగిన కుల సంఘం సమావేశానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద రెడ్డి హాజరవడంపై SEC కన్నెర్ర చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్ను ఆదేశించింది. కాగా, విశాఖ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఓ కుల సంఘం సమావేశానికి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి హాజరవటంపై టిఎన్‌ఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్, ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. తక్షణమే వీసీని తొలగించాలంటూ ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశాడు.

ఇలాఉండగా, విశాఖ పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయి ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విశాఖలో విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి విశాఖ కలెక్టరేట్ లో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికార యంత్రాంగానికి దశ దిశ నిర్దేశించారు. వర్చువల్ విధానంలో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల రాజకీయ పార్టీల నేతలతో నిమ్మగడ్డ సమావేశం అయ్యారు. అనంతరం విశాఖ జిల్లా రాజకీయ పార్టీల నేతలతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతల నుంచి పలు సలహాలు, సూచనలు, ఫిర్యాదులను స్వీకరించారు SEC రమేష్ కుమార్.

ఇదికూడా చదవండి :  రేషన్‌ వాహనాల రంగుల మార్పుపై వెనక్కి తగ్గిన ఎస్ఈసీ, తాజా నిర్ణయంతో ప్రభుత్వ పిటిషన్‌ను క్లోజ్‌ చేసిన ఏపీ హైకోర్టు