AP – Telangana: వచ్చిందడోయ్ వాన కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది అనే అంశంపై వాతావరణ శాఖ క్లారిటీ ఇచ్చింది. పశ్చిమ గాలుల ద్రోణుల ప్రభావం, ఉపరితల చక్రవాత ప్రభావంతో ఉభయ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

AP - Telangana: వచ్చిందడోయ్ వాన కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
Andhra and Telangana Weather

Updated on: Jun 06, 2025 | 6:01 PM

83° తూర్పు రేఖాంశం, 20° ఉత్తర అక్షాంశం వద్ద సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి కారణంగా వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి ఈశాన్య బంగ్లాదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో బలహీనపడిన ద్రోణి ఉంది. మరోవైపు వీస్తున్న పశ్చిమ, వాయువ్య దిశల గాలుల కారణంగా రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్‌డేట్

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:

శుక్రవారం : తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఉండే చాన్స్ ఉంది

శనివారం, ఆదివారం: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు ఉంటాయన్నది అంచనా

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:

శుక్రవారం : తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే చాన్స్ ఉంది. వేగంగా ఈదురుగాలులు, అసౌకర్యంగా వేడి వాతావరణం ఉంటుందని చెబుతున్నారు

శనివారం, ఆదివారం: వర్షాలు కురిసే అవకాశం ఉందన్నది వెదర్ రిపోర్ట్

తెలంగాణ విషయానికి వస్తే శుక్రవారం, శనివారం కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందన్నారు. ఆదివారం తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.