జీవితానికి అర్ధం నేటి యువతలో మారింది.. చిన్న చిన్న కష్టాలకే చావు పరిష్కారం అనే దిశగా ఆలోచిస్తున్నారు. ఎంతో జీవితం ఉండనే బలవంతంగా తనువు చాలిస్తున్నారు తాజాగా ఓ యువకుడు ‘నా చావుకు నేనే కారణం.. లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నాను. అవి కట్టలేక పోతున్నాను. అప్పుల బాధ ఎక్కువ వలన చనిపోతున్నాను. నా చావుకు ఎవరూ కారణం కాదు.’ ఉల్లి మణికంఠ. అని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని ఎస్ రాయవరంలో విషాదంలో విషాద ఘటన చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులతో వరాహ నదిలో దూకాడు మణికంఠ అనే యువకుడు. పెనుగొల్లు హైవే బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకేసాడని స్థానికులు చెబుతున్నారు. లోన్ యాప్ అప్పుల బాధతో చనిపోతున్నానని సూసైడ్ నైట్ కూడా రాసిపెట్టాడు.
నా చావుకు నేనే కారణం.. లోన్ యాప్ లో డబ్బులు తీసుకున్నాను. అవి కట్టలేక పోతున్నాను. అప్పుల బాధ ఎక్కువ వలన చనిపోతున్నాను. నా చావుకు ఎవరూ కారణం కాదు. ఉల్లి మణికంఠ.’ అని సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు.. మణికంఠ కోసం నదిలో గాలిస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్, మనికంఠ చెప్పులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ గేమ్స్, లోన్ యాప్లతో అప్పుల పాలయ్యడు మణికంఠ. చనిపోతున్నానని సూసైడ్ లెటర్ రాసి మణికంఠ కనిపించకుండా పోవడంతో.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మణికంఠ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..