Weather Report: రైతులకు పండగలాంటి వార్త.. ఈ జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలే వర్షాలు!

వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Weather Report: రైతులకు పండగలాంటి వార్త.. ఈ జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలే వర్షాలు!
Andhra Pradesh Weather Forecast

Updated on: Aug 18, 2026 | 5:32 PM

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వర్ష సూచనలు జారీ చేసింది. జార్ఖండ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో, 23.9° ఉత్తర అక్షాంశం, 85.8° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైందని.. ఇది జార్ఖండ్, బీహార్ మీదుగా వాయువ్య దిశగా కదులుతూ, రాబోయే 24 గంటల్లో బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

అలాగే సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు ఫిరోజ్‌పూర్, డెహ్రాడూన్, షాజహాన్‌పూర్, వారణాసి, దేహ్రీ, జార్ఖండ్ మరియు దానిని ఆనుకుని ఉన్న గంగానది పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంతాలు, దిఘా మీదుగా ఉన్న వాయుగుండం కేంద్రం గుండా ప్రయాణిస్తూ, అక్కడి నుండి ఆగ్నేయంగా వాయువ్య బంగాళాఖాతం వైపుగా విస్తరించి ఉందని.. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం వాతావరణం

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం జిల్లా్ల్లో మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అలాగే గురువారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. వర్షాలు కరిసే సమయంలో గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు కూడా వీస్తామని వాతావరణ శాఖ తెలిపింది.

దక్షిణ కోస్తాంధ్ర వాతావరణం

ఇక దక్షిణ కోస్తాంధ్రలో మంగళ, బుధవారల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని పేర్కొంది.

రాయలసీమ వాతావరణం:

ఇక రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధ, గురువారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. అలాగే వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us