
ఒక రోజు కోలాటం.. మరో రోజు డాన్స్‌లు..ఇప్పుడు బాక్సింగ్..ఏపీ పర్యాటక మంత్రి రోజా సందడి మామూలుగా లేదు. అటు స్టేజీ మీదా.. ఇటు మైదానంలో అంతా తానై హల్‌చల్ చేస్తున్నారు రోజా. విశాఖలోని బీచ్ రోడ్ YMCAలో సీఎం బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ఏపీ పర్యాటక మంత్రి రోజా సందడి చేశారు. వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహిస్తోన్న సర్ణోత్సవ వేడుకల సాంస్కృతిక కార్యక్రమాల్లో స్టెప్పులేసి ఊపునిచ్చిన మంత్రి రోజా.. తాజాగా బాక్సింగ్ రింగులోకి దిగి పవర్‌ఫుల్ పంచ్‌లతో క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈలలు….చప్పట్ల మధ్య రోజా బాక్సింగ్ పంచ్‌లు ఇప్పుడు సర్వత్రా హల్‌చల్ చేస్తున్నాయి.
ఇటీవల రోజా మాట్లాడుతూ.. ‘‘జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందని. ముఖ్యమంత్రి జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడిందని, అభివృద్ధి చెందిందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకునేలా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిస్ట్ ప్రాంతాల్లో మరిన్ని వసతులు కల్పించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. స్వదేశీ దర్శన్, ప్రసాద పథకాలలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు నాలుగు ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని రోజా తెలిపారు.