Hidden Treasure: రెచ్చిపోయిన దొంగలు.. గర్భగుడికి సొరంగ మార్గం.. వైరల్ అవుతున్న వీడియో..!

|

Feb 03, 2022 | 11:46 AM

Hidden Treasure: రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే దురాశ, కష్టపడకుండానే భారీగా నిధులు సంపాదించాలనే పేరాశతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.

Hidden Treasure: రెచ్చిపోయిన దొంగలు.. గర్భగుడికి సొరంగ మార్గం.. వైరల్ అవుతున్న వీడియో..!
Follow us on

Hidden Treasure: రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే దురాశ, కష్టపడకుండానే భారీగా నిధులు సంపాదించాలనే పేరాశతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని ఎర్రమల కొండల్లో గుప్త నిధుల వేట కలకలం సృష్టించింది. దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా గడివేముల మండలం ఎర్రమల కొండల్లో కొందరు దుండగులు గుప్త నిధుల కోసం యధేచ్చగా తవ్వకాలు జరిపారు. లక్ష్మీరంగ స్వామి దేవాలయం, ఏడు ఊర్ల బావి, పురాతన బావి తదితర పరిసరాల్లో తవ్వకాలు జరిపారు. లక్ష్మీ రంగ స్వామి గర్భగుడికి సొరంగ మార్గం ఏర్పాటు చేశారు దుండగులు. కాగా, గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు జరుపుతుండగా.. కొందరు గమనించి వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగున్నా.. పోలీసులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇకనైనా స్పందించి.. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపే దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అధికారులు.

లక్ష్మీ గణపతి దేవాలయంలో చోరీ..
ఈ ఘటన ఇలా ఉంటే.. కర్నూలు జిల్లాకు పొరుగు జిల్లా అయిన కడపలోని ఓ దేవాలయంలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని బి కోడూరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలోని లక్ష్మీ గణపతి దేవాలయంలో చోరీ జరిగింది. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు గుడి తాళాలు పగలగొట్టి హుండీని దొంగిలించారు. అందులో ఉన్న డబ్బును తీసుకుని.. హుండీని ఊరి బయట పడేసి వెళ్లారు. ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Also read:

Crime News: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తుపాకీ కలకలం.. దర్జాగా విమానంలో తీసుకొచ్చి..

Loan EMI Tips: లోన్ EMI మీకు భారంగా మారిందా.. ఈ చిట్కాలతో రుణాన్ని తిరిగి చెల్లించడం చాలా ఈజీ..

IND vs WI: ఆయనతో నాకు ఎలాంటి పోలిక లేదు: హార్దిక్ పాండ్యాతో పోలికలపై టీమిండియా ఆల్ రౌండర్ కీలక వ్యాఖ్యలు