Cyclone Alert: తుఫాన్ తరుముకొస్తుంది.. ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు

|

Dec 07, 2022 | 9:17 PM

తుఫాన్ తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే వెదర్ డిపార్డ్‌మెంట్ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది. ఈ క్రమంలోనే ప్రజలకు కొన్ని సూచనలు చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ.

Cyclone Alert: తుఫాన్ తరుముకొస్తుంది.. ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు
Andhra Pradesh Weather Report
Follow us on

ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతుందని.. ఇది గురువారం ఉదయానికి తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 610 కి.మీ., చెన్నైకి 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ రేపు ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర తమిళనాడు- దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకుంటుందని అన్నారు. దీని ప్రభావంతో గురువారం నుంచి మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో… రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ఎండి అంబేద్కర్ తెలిపారు.

భారీవర్షాల నేపధ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఆరు జిల్లాల్లోని కోటిమందికి పైగా సబ్‌స్క్రైబర్లకు హెచ్చరిక సందేశాలు పంపినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీచేశామన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకోసం 5-ఎన్డీఆర్ఎఫ్, 4-ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని తెలియజేశారు.

సముద్రం అలజడిగా ఉంటుందని దక్షిణకోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం పడేటప్పుడు చెట్ల కిందకు వెళ్లవద్దని.. చెరువులు, కావలలకు సమీప ప్రాంతాల్లో నిశింసించేవారు సరిక్షత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కరెంట్ పోల్స్ వంటివి ముట్టుకోవద్దని హెచ్చరించారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..