Cabinet meeting: నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ… టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధులు, ఐటీ పాలసీపై చర్చ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధతతో పాటు కరోనా నివారణ, నియంత్రణ చర్యలు

Cabinet meeting: నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ... టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధులు, ఐటీ పాలసీపై చర్చ
Jagan

Updated on: Jun 30, 2021 | 7:05 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధతతో పాటు కరోనా నివారణ, నియంత్రణ చర్యలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నగరాలు, పట్టణాల్లో మధ్యతరగతి వర్గాల ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి సంబంధించి విధివిధానాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.

పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల సమీకరణపై చర్చిస్తారు.పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీరణ చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ. 5900 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. దీనికి తోడు ప్రైవేట్ యూనివర్శిటీలు, విద్యార్ధులకు లాప్ టాపుల పంపిణీ, భూ సేకరణ చట్టం వంటి అంశాలపై చర్చిస్తారు.

వీటితోపాటు ఐటీ పాలసీకి కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణతో జల వివాదాలు ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీలో నిర్మించే రాయలసీమ ఎత్తిపోతలను అక్రమ ప్రాజెక్టులనడంపై ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ పైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీల ఏర్పాటు పై చర్చ జయనగరం, ఒంగోలులో విశ్వవిద్యాలయాల ఏర్పాటు, మరిన్ని 104 వాహనాల కొనుగోలు, పశు వైద్యానికి సంబంధించి అంబులెన్స్‌ల ఏర్పాటు తదితర విషయాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి: AP High Court: హైకోర్టులో ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకంపై విచారణ.. రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించిన కోర్టు