Andhra Pradesh: అర్థరాత్రి తుపాకీతో కాల్చుకున్న ఎస్సై.. ఆత్మహత్యకు అసలు కారణం ఇదేనా!?..

|

May 13, 2022 | 5:29 PM

Andhra Pradesh: కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అర్థరాత్రి దాటిన తరువాత..

Andhra Pradesh: అర్థరాత్రి తుపాకీతో కాల్చుకున్న ఎస్సై.. ఆత్మహత్యకు అసలు కారణం ఇదేనా!?..
Gun
Follow us on

Andhra Pradesh: కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అర్థరాత్రి దాటిన తరువాత ఇంట్లో గన్‌తో కాల్చుకుని ఎస్ఐ సూసైడ్ చేసుకున్న ఘనటపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు.. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తుండగా.. మరోవైపు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ దగ్గర జగ్గయ్య చెరువు గ్రామానికి చెందిన గోపాలకృష్ణ.. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం సీఎం బందోబస్త్‌లో విధులు నిర్వహించాడు. 2014 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన గోపాలకృష్ణకు తొలుత ఉద్యోగం పట్ల ఆసక్తి ఉన్నా.. ఆ తరువాత ఆ ఆసక్తి మొత్తం పోయింది. అప్పటి నుంచి తనకు ఈ ఉద్యోగం ఇష్టం లేదని, ఏదైనా వ్యాపారం చేస్తానంటూ భార్యకు చెబుతూ వచ్చాడు. అయితే, గురువారం నాడు సీఎం బందోబస్త్‌ నుంచి ఇంటికి వచ్చిన గోపాలకృష్ణ.. అందరితో బాగానే మాట్లాడాడు. ఒక గదిలో భార్య, పిల్లలు నిద్రిస్తుండగా.. గోపాలకృష్ణ ఉదయం 5 గంటల సమయంలో హాల్‌ లోకి వచ్చి తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. గోపాలకృష్ణకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగం ఇష్టం లేకనే గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.