Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో ఎమోషనల్ మైండ్‌గేమ్‌.. సెంటిమెంట్ పాలిటిక్స్ మొదలుపెట్టిన ప్రధాన పార్టీలు..

|

Aug 13, 2023 | 2:11 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమోషనల్ మైండ్‌గేమ్‌ ఓ రేంజ్‌లో జరుగుతోంది. సెంటిమెంటే ప్రధాన పాలిటిక్స్ మొదలుపెట్టాయి అధికార- విపక్షాలు. జనసేన కూడా సెంటిమెంట్ రూట్‌లోనే వెళుతోందా? మూడో విడత యాత్రలో భాగంగా విశాఖలో తిరుగుతున్న వారాహి రథం.. ఎక్కడెక్కడ ఆగుతోంది..? పెందుర్తిలో పవన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్.. భావోద్వేగాలపై ప్రభావం చూపబోతోందా? ఆయన మాటలతోనే మొదలైన వాలంటీర్ల వివాదం.. ఇప్పుడు కొత్తగా ఏ టర్న్ తీసుకోబోతోంది? ఇంతకూ పవన్ అంత ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఏమిచ్చారు?

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో ఎమోషనల్ మైండ్‌గేమ్‌.. సెంటిమెంట్ పాలిటిక్స్ మొదలుపెట్టిన ప్రధాన పార్టీలు..
Andhra Pradesh Political Leaders
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమోషనల్ మైండ్‌గేమ్‌ ఓ రేంజ్‌లో జరుగుతోంది. సెంటిమెంటే ప్రధాన పాలిటిక్స్ మొదలుపెట్టాయి అధికార- విపక్షాలు. జనసేన కూడా సెంటిమెంట్ రూట్‌లోనే వెళుతోందా? మూడో విడత యాత్రలో భాగంగా విశాఖలో తిరుగుతున్న వారాహి రథం.. ఎక్కడెక్కడ ఆగుతోంది..? పెందుర్తిలో పవన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్.. భావోద్వేగాలపై ప్రభావం చూపబోతోందా? ఆయన మాటలతోనే మొదలైన వాలంటీర్ల వివాదం.. ఇప్పుడు కొత్తగా ఏ టర్న్ తీసుకోబోతోంది? ఇంతకూ పవన్ అంత ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఏమిచ్చారు?

వారాహి రెండో విడత యాత్రలోనే వాలంటీర్ల వ్యవస్థపై యుద్దం ప్రకటించిన పవన్‌కల్యాణ్… మూడో విడతలో ఆ యుద్దాన్ని పెద్దగా చేశారు. విమర్శలకు పదును పెంచేశారు. పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబీకుల్ని పరామర్శించే క్రమంలో వాలంటీర్ల వ్యవస్థపై సీరియస్ కామెంట్లు చేశారు పవన్. సినిమాల్లో చూపించే దండుపాళ్యం బ్యాచ్‌కీ వాలంటీర్లకు తేడా లేదని, ఒంటరి మహిళల గొంతు గోస్తున్నారని ఆరోపించారు.

వీళ్లు చేసే నేరాలన్నిటికీ ప్రభుత్వమే కారణం అనేది తమ అభిమతం కాదని, లోపాలుంటే సరిదిద్దాల్సిన జగన్ సర్కార్ నిర్లక్ష్యం వహించడం వల్లే తాను ఉద్యమిస్తున్నానని చెప్పారు.

గ్రీనరీని, పర్యాటకాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, కొండల్ని తవ్వి ఇళ్లు కట్టుకోవడం ఏం సంప్రదాయమని పవన్ అడిగిన ప్రశ్నలకు అధికారపక్షం నుంచి కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. మీ ఇళ్లున్న బంజారాహిల్స్‌, జూబ్లీ హిల్స్‌ కొండలు కావా అనేది రూలింగ్ పార్టీ ఎదురుప్రశ్న. రిషికొండ భూముల వివాదం కొనసాగుతుండగానే.. మూడో రోజు యాత్రలో విశాఖలోనే మరో భూవివాదాన్ని బైటి ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నించారు పవన్.

ఇలా.. అదరగొట్టే ఎమోషన్స్‌తో హాట్‌హాట్‌గా సాగింది పవన్ వారాహి మూడో దశ- మూడో రోజు యాత్ర. వాలంటీర్ల వ్యవస్థను మళ్లీ టార్గెట్ చేయడం, స్థానిక ప్రజా ప్రతినిధులపై విమర్శలకు దిగడం ద్వారా.. జగన్ సర్కార్‌ మీద దాడిని నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్తున్నారు పవన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..