AP Current Charges: విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం లేదు, భవిష్యత్తులో కూడా పెంచబోం: ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని

|

Sep 15, 2021 | 5:49 PM

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం లేదని, భవిష్యత్తులో కూడా పెంచబోమని ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి

AP Current Charges: విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం లేదు, భవిష్యత్తులో కూడా పెంచబోం: ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని
Balineni
Follow us on

Minister Balineni: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఉద్దేశ్యం లేదని, భవిష్యత్తులో కూడా పెంచబోమని ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐదుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచామని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన ఇవాళ ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ తేల్చి చెప్పారు. 9 వేల కోట్ల భారం వేశారని అబద్దాలు చెబుతున్నారని ఆయన తెలిపారు. 2014 నుంచి 2019 వరకు విద్యుత్‌ డిస్కంలకు బకాయి పడిన డబ్బులే ఇప్పుడు చెల్లించాల్సి వస్తుందన్నారు.

విద్యుత్ వ్యవస్థలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఇప్పుడు సరిచేస్తున్నామని మంత్రి బాలినేని తెలిపారు. చిత్తశుద్ది ఉంటే ఈ బాకీలపై చంద్రబాబు చర్చకు రావాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ఏడెనిమిది నెలలు ఈ భారం ప్రజలపై ఉంటుందని, రైతులకు సంబంధించి 900 కోట్లు ప్రభుత్వమే భరించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. అద్దెఇళ్ళల్లో ఉండేవారికి విద్యుత్‌ రాయితీ ఇచ్చే విషయం సీయంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బాలినేని తెలిపారు.

ఇక, నేడు విద్యుత్ సంస్ధలు వసూలు చేయాలని నిర్ణయించిన ‘ట్రూఅప్’ ఛార్జీల విధింపునకు గత ప్రభుత్వహయాంలో చంద్రబాబు అవలంభించిన విధానాలే కారణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బాబు తన పాలనలో అస్తవ్యస్త విధానాల కారణంగా విద్యుత్ సంస్ధలు నష్టాలలో కూరుకుపోయాయని ఆయన చెప్పుకొచ్చారు. వాటిని అధగమించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానిదని అన్నారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం కురుబ కులస్ధుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.

Read also: Pawan Kalyan: చిన్నారి చైత్ర కుటుంబానికి జనసేనాని పవన్ పరామర్శ.. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా