Andhra Pradesh: కృష్ణా డెల్టాలోని ఖరిఫ్ పంట సాగు కోసం సాగునీటిని విడుదల చేశారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటిరాంబాబు. కృష్ణామ్మకు విశిష్ట పూజలు నిర్వహించారు. బటన్ నొక్కి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, మంత్రి జోగి రమేష్ , ఎమ్మేల్యే మల్లాది విష్ణు, మెరుగు నాగర్జున తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా తూర్పు డెల్టాకి 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకి 500 క్యూసెక్కులు సాగునీరు విడుదలైంది.ఏపీలో ఋతుపవనాలు ముందుగా వస్తున్నాయన్నాని చెప్పారు మంత్రి అంబటి. ఖరిఫ్ పంట ఈసారి బాగా రావాలని కోరుకున్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పారు మంత్రి. ఈ సదా అవకాశాన్ని రైతులు ఉపయోగించుకొని ఎర్లీగా పంటలు వేయాలని కోరారు మంత్రి.
కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పారు మంత్రి అంబటి. కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలు ఉన్నాయని తెలిపారు. పులిచింతలలో పుష్కలంగా నీరు ఉండటంతో 35 టీఎంసీల సాగునీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. రుతు పవనాల రాకతో సాగునీటికి ఇబ్బంది ఉండదన్నారు. సాగునీటిని ముందుగా విడుదల చేయడంతో నవంబర్‌లో ఖరీఫ్ పూర్తి అవుతుంది.. రెండో పంటని కూడా డిసెంబర్ నెలలోనే వేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు మంత్రి.