Ap Weather: ఏపీలో 2 రోజులపాటు చెదురుమదురు వర్షాలు.. వెల్లడించిన అమరావతి వాతావరణ కేంద్రం

|

Nov 04, 2022 | 1:56 PM

నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో గల ఉపరితల ఆవర్తనం.. ఈశాన్య రుతుపవనాల కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Ap Weather: ఏపీలో 2 రోజులపాటు చెదురుమదురు వర్షాలు.. వెల్లడించిన అమరావతి వాతావరణ కేంద్రం
Andhra Weather Report
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజంట్ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో 2 డేస్ కంటిన్యూ అవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు గాలులు వీయడం వల్ల.. జల్లులు పడే ఛాన్స్ ఉందని  వెల్లడించింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

————————————————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :

ఈ రోజు, రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి :- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

ఈ రోజు, రేపు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడినజల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :-

ఈ రోజు, రేపు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.