AP High Court: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం.. కరోనా రిపోర్టు అలస్యమైతే రోగి పరిస్థితి ఏంటన్న న్యాయస్థానం

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ చికిత్సలపై హైకోర్టులో విచారణ చేపట్టింది. రాష్ట్రంలో జరుగుతున్న కరోనా చికిత్సలపై హైకోర్టులో ఏపీ లిబర్టీ అసోసియేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

AP High Court: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు  ప్రశ్నల వర్షం.. కరోనా రిపోర్టు అలస్యమైతే రోగి పరిస్థితి ఏంటన్న న్యాయస్థానం

Updated on: Apr 27, 2021 | 1:53 PM

High Court on Corona Treatment: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ చికిత్సలపై హైకోర్టులో విచారణ చేపట్టింది. రాష్ట్రంలో జరుగుతున్న కరోనా చికిత్సలపై హైకోర్టులో ఏపీ లిబర్టీ అసోసియేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏపీలో కోవిడ్ పరిస్థితులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఇపుడు ఉన్న ఆక్సిజన్ నిల్వలు ఎంత కాలం సరిపోతాయన్న అడిగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను తెరిచారా? అని ప్రశ్నించింది.

అలాగే, పరిస్థితికి సరిపడా చర్యలు చేపట్టమన్న ప్రభుత్వ సమాధానంపై తీసుకున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో పడకలు, సౌకర్యాలు సరిపడా ఉన్నాయా? అని ఆరా తీసింది. రాష్ట్రంలో ఎన్ని ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశారు?.. కొవిడ్‌ పరీక్షలు ఎంతమేర పెంచారు.. నివేదికలు ఎన్ని రోజుల్లో వస్తున్నాయని కోర్టు అడిగింది. నిర్ధారణ పరీక్షలు ఆలస్యమైతే.. బాధితుల పరిస్థితి ఏంటి? అని ప్నశ్నించింది. కాగా, గతంలో 3 రోజులు పట్టేదని ఇపుడు 124 నుంచి 36 గంటల సమయం పడుతోందని ప్రభుత్వం వివరించింది. సుమారు గంటపాటు.విచారణ జరిపిన ధర్మాసనం… అన్ని వివరాలను పిటిషనర్‌ కౌన్సిల్‌తోపాటు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరుఫున న్యాయవాది సురేష్ వాదనలు వినిపించారు.

Read Also…  TS Govt.: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక.. కోవిడ్ కట్టడికి చేపడుతున్న చర్యలు వివరించిన సర్కార్

Loading...
Unable to load recommendations.
Follow Us