Andhra Pradesh: ఆ సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం.. రైతులకు చేకూరనున్న ప్రయోజనం

|

Dec 15, 2021 | 7:41 AM

APలో రైతు భరోసా కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇందుకు సాంకేతికతను జోడిస్తోంది జగన్ సర్కార్. తాజాగా దీనిపై కీలక ఒప్పందం కుదిరింది.

Andhra Pradesh: ఆ సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం.. రైతులకు చేకూరనున్న ప్రయోజనం
Ap Govt
Follow us on

APలో రైతు భరోసా కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇందుకు సాంకేతికతను జోడిస్తోంది జగన్ సర్కార్. తాజాగా దీనిపై కీలక ఒప్పందం కుదిరింది. యునైటెడ్‌ నేషన్స్‌కు చెందిన పుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ బృందం, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిశారు. సుస్థిర వ్యవసాయ–ఆహార వ్యవస్ధలను అలవర్చుకోవడంతో పాటు, APలో రైతుల సామర్ధ్యాన్ని పెంచేందుకు, FAO– AP ల మధ్య టెక్నికల్‌ కోపరేషన్‌ ప్రాజెక్టు ఒప్పందం కుదిరింది. సీఎం జగన్‌ సమక్షంలో వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య.. టోమియో షిచిరి, పుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ యునైటెడ్‌ నేషన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఏ.కె సింగ్‌ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అంతర్జాతీయంగా అందరికీ ఆహార భద్రతపై కృషి చేస్తోంది ఏఫ్‌ఏఓ. అటు ఏపీలోని ఆర్బీకేలకు సాంకేతికంగా, ఆర్థికంగా సాయం అందించనుంది ఈ సంస్థ. రైతు భరోసా కేంద్రాల బలోపేతం చేసేందుకు ఎఫ్‌ఏఓ, ఐసీఏఆర్‌ సహకరించనున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతనంగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు, ఆర్బీకే సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వనుంది ఎఫ్‌ఏఓ.

ఉత్తమ సాగు పద్ధతుల్లోనూ రైతులకు శిక్షణ అందించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులను ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు సీఎం జగన్‌. ఆర్బీకేల ద్వారా రైతులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు ముఖ్యమంత్రి. గతంలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల వాడకం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయారని, ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపే ప్రయత్నంలోనే ఆర్బీకేలు వచ్చాయని వివరించారు జగన్. రైతులకు మద్దతు ధర లభించేలా తగిన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ రంగంలో మార్పులు వస్తున్నాయని ప్రతినిధులకు వివరించారు ముఖ్యమంత్రి జగన్.

Also Read: దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌పై ఈరోజు ఎంత పెరిగిందంటే..