Andhra Pradesh: ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులపై క్లారిటీ.. ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే..?

తెలంగాణలో సెలవుల షెడ్యూల్ వచ్చేసింది.. మరి ఏపీ సంగతి ఏంటి..? స్టూడెంట్స్ నెట్టింట ఇప్పుడు ఆ సెర్చింగ్‌లోనే ఉన్నారు. ఆ వివరాలు మీ కోసం తీసుకువచ్చాం...

Andhra Pradesh: ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులపై క్లారిటీ.. ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే..?
Ap School Holidays

Updated on: Feb 17, 2023 | 1:20 PM

తెలంగాణలో ఒంటిపూట బడులు, సెలవులపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దీంతో ఏపీ స్టూడెంట్స్ సైతం ప్రభుత్వం ఎప్పుడు సెలవులు ప్రకటిస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం.. 1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 27తో ముగియనున్నాయి. మరో 2 రోజులు ఎగ్జామ్ రిజల్ట్స్ వెల్లడి, పేరెంట్స్  మీటింగ్స్ వంటివి ఉండనున్నాయి.  ఏప్రిల్ 30 నుంచి స్కూల్స్‌కు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారుల ద్వారా అనధికారికంగా తెలిసింది. అయితే ఉష్టోగ్రతలు కాస్త ఎక్కువగా ఉంటే.. ఈ సెలవులు షెడ్యూల్ కాస్త ముందుకు జరిగే అవకాశం కూడా ఉంది. మళ్లీ జూన్ 12 నుంచి స్కూల్స్ పున: ప్రారంభం అవ్వనున్నట్లు సమాచారం.  పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఆ తర్వాత వారికి హాలిడేస్ ఉంటాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్ని ఆరు సబ్జెక్టులకు మాత్రమే నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

పరీక్షల టైమ్ టేబుల్ ఫైనల్ చేసిన నేపథ్యంలో పబ్లిక్‌ హాలీడేలు, సాధారణ సెలవులు ప్రకటించినా ఆ రోజుల్లో పరీక్షలు యథాతథంగా జరుగనున్నాయి. స్టూడెంట్స్‌కు కేటాయించిన కేంద్రాల్లో మాత్రమే పరీక్షలను రాయాల్సి ఉంటుందని, ఎగ్జామ్ సెంటర్స్ మార్పును ఎట్టి పరిస్థితుల్లో అమోదించరని AP SSC బోర్డు గతంలో స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us