Andhra Pradesh: చంద్రబాబు నాటకంలో పావులుగా వివేకా కూతురు, అల్లుడు.. సంచలన కామెంట్స్ చేసిన సజ్జల..

| Edited By: Ravi Kiran

Mar 01, 2022 | 8:02 PM

Andhra Pradesh: దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Andhra Pradesh: చంద్రబాబు నాటకంలో పావులుగా వివేకా కూతురు, అల్లుడు.. సంచలన కామెంట్స్ చేసిన సజ్జల..
Sajjala Ramakrishna
Follow us on

Andhra Pradesh: దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాటకంలో వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పావులుగా మారారని వ్యాఖ్యానించారు. ఆ కారణంగానే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. వివేకా ఇంట్లో హత్య జరిగిందని, అక్కడ మనుషులను కూడా ఇప్పుడు తమపై బురద జల్లుతున్నవారే పెట్టారని అన్నారు సజ్జల. విచారణ అడ్డగోలుగా జరుగుతుంటేనే కోర్టుకు వెళ్లామన్నారు. వివేకా వ్యక్తిగత జీవితంపై తామెప్పుడూ వ్యాఖ్యలు చేయలేదని సజ్జల అన్నారు. హత్య జరిగిన తర్వాత చంద్రబాబు, అతని మీడియా వివేకాపై వ్యక్తిగతంగా ఎన్నో వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేకనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అన్నారు. ‘‘దస్తగిరి ఎవరు?.. అతని తరపున లాయర్లు ఎవరు?.. కాల్ రికార్డులు బయటకు వస్తే అన్ని వివరాలు తెలుస్తాయి.’’ అని అన్నారు సజ్జల.

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరగాలనే ఉద్దేశం సీఎం జగన్‌కు ఉందని, అందుకే ఆయన ఎక్కడా జోక్యం చేసుకోలేదన్నారు. ‘‘సునీత టీడీపీలోకి వెళ్తోందనే ప్రచారం జరుగుతోంది.. వెళితే వెళ్లవచ్చు.. చెప్పుడు మాటలు వినవద్దు..’’ అని వారికి హితవు చెప్పారు సజ్జల. గతంలో సీబీఐకి నో ఎంట్రీ అన్న వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐ విచారణపై కామెంట్స్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన స్టేట్‌మెంట్స్‌ను ఎవరూ విశ్వసించొద్దన్నారు. సునీత, రాజశేఖర్ ఈ స్టేట్‌మెంట్స్‌ను ఖండించనందున.. జరుగుతున్న ప్రచారాన్ని నిజమనే అనుకోవాల్సి వస్తుందన్నారు.

ఇదిలాఉంటే.. వివేకా హత్య జరిగిన రోజున.. సూసైడ్ లెటర్ ఉందని జగన్‌కు చెప్పింది సునీత నే అని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కేసులో విచారణ విచారణలా జరుగడం లేదన్నారు. ‘‘ఎన్నికల ముందు వివేకా హత్య జరిగింది.. మేం బాధితులం. టీడీపీ దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూసింది. మేము కాదు.’’ అని సజ్జల పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో విచారణ జరుగుతున్న తీరుపై ప్రధాని, హోంమంత్రి, సీబీఐ దృష్టికి తీసుకువెళతామని అన్నారు.

Also read:

Cholesterol: శరీరంలో కొవ్వు పెరగకూడదంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

Obesity: ఊబకాయం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందా?

Russia Ukraine Crisis: పుతిన్‌కు షాకిచ్చిన వరల్డ్ టైక్వాండో.. బ్లాక్ బెల్ట్‌‌ వెనక్కు..