Good News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. తల్లికి వందనం అమలు ఎప్పటినుంచంటే…?

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కచ్చితంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా.. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై, ప్రస్తుత, గత ప్రభుత్వానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రస్తావించారు.

Good News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. తల్లికి వందనం అమలు ఎప్పటినుంచంటే...?
CM Chandrababu

Updated on: Feb 25, 2025 | 9:38 PM

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కచ్చితంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా.. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై, ప్రస్తుత, గత ప్రభుత్వానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రస్తావించారు. వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని.. డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు అన్నారు. సభను గౌరవించలేని, సంస్కారం లేని పార్టీ వైసీపీ అని సీఎం చంద్రబాు తప్పుపట్టారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ దిగజారి మాట్లాడుతోందని.. 11 మంది సభ్యులు సభలో 11 నిమిషాలే ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న ఏపీని గాడిలో పెడుతున్నామని కేంద్రం నుంచి రాష్ట్రానికి మంచి తోడ్పాడు అందుతోందని చంద్రబాబు వెల్లడించారు.

సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తాం..

మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని, కేంద్రం తదుపరి ఇచ్చే వాయిదాతో కలిపి రైతు భరోసా ఇస్తాం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తల్లికి వందనం పథకం అమలు వెంటనే అన్నదాత పథకం తీసుకువస్తామని చెప్పారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని అమలు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం ఇస్తామని.. సాగుకు భరోసా ఇచ్చేలా రైతన్నకు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి మూడు విడతల్లో రూ.20 వేలు అందజేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థికసాయం అందిస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. దగా పడిన రాష్ట్రాన్ని కాపాడటం కోసమే..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని.. కేంద్రం ఊహించిన దానికంటే ఎక్కువగా సహకరిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. ఏపీని హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీగా మార్చేందుకు స్వర్ణాంధ్ర విజన్‌ -2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

వైసీపీ తీరుపై అసహనం..

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ తీరు పై అసహనం వ్యక్తం చేశారు. పోడియం దగ్గర పేపర్లు చింపి విసిరేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి తమ పార్టీ సభ్యులతో అలా చేయించడం సరికాదన్నారు. ఇదే అంశంపై మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును వైసీపీ గౌరవించడం లేదన్నారు. గవర్నర్ పట్ల వైసీపీ వ్యవహరించిన తీరు దుర్మార్గమని..ప్రతిపక్ష స్థానానికి కూడా వైసీపీ పనికిరాదని ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. అసెంబ్లీలో వైసీపీ ప్రవర్తించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మండిపడ్డారు. వాళ్ల తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లతో చేసిన విధ్వంసమే గుర్తొచ్చిందన్నారు. కాగా.. సీఎం చంద్రబాబు ప్రసంగం అనంతరం.. అసెంబ్లీ సమావేశాలు శుక్ర వారానికి వాయిదా పడ్డాయి. అదే రోజు ఏపీ ప్రభుత్వం 2025-26 బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..