Paper leak: తెలంగాణ పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్‌పై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.

|

Apr 06, 2023 | 4:26 PM

తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్‌ వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ పోలీసులు 24 గంటల్లోనే హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఓ మైనర్ సహా మరో ఇద్దరిని...

Paper leak: తెలంగాణ పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్‌పై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.
Botsa Satyanarayana
Follow us on

తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్‌ వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ పోలీసులు 24 గంటల్లోనే హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఓ మైనర్ సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ అంశం పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షడు బండి సంజయ్‌ ప్రధాన సూత్రధారి అంటూ పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అంతా ఆయన కనుసన్నల్లోనే ఇది జరిగిందని ఆధారాలు దొరకనీయకుండా సెల్ ఫోన్ కూడా దాచినట్లు ఆరోపించారు.

ఇక తాజాగా ఈ అంశంపై ఆంధప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెలంగాణలో పదో తరగతి క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌పై స్పందించిన మంత్రి.. పేపర్ల లీక్‌కు పాల్పడిన వారిని దేవుడు కూడా క్షమించడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేందుకు ప్రయత్నించడం దౌర్భాగ్యమన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలను పటిష్టంగా నిర్వహిస్తున్నామని తెలిపిన మంత్రి.. గతేడాది పేపర్‌ లీకేజీకి పాల్పడిన 75 మందిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు గుర్తిచేశారు. ఈ ఏడాది ఎలాంటి అవంఛానీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..